Clock Of Nellore ( Jaladanki ) – దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయాల సాధన కోసం వారి చిన్నాన్న, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. జలదంకి మండలం, బ్రాహ్మణ క్రాక గ్రామంలో జరిగిన గౌతమ్ రెడ్డి సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి పాల్గొని గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గౌతమ్ రెడ్డితో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని గుర్తు చేశారు. సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని సిఎం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. గౌతమ్ రెడ్డి ఆశయాల సాధన కోసం వారి చిన్నాన్న, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సిఎంను కోరారు.
