ముఖ్యమంత్రి జగన్ కు నెల్లూరులో స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు…

Clock Of Nellore ( Nellore ) – దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో పాల్గొనేందుకు నెల్లూరుకు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పోలీస్ కవాతు మైదానంలో స్వాగతం పలికారు. గన్నవరం నుండి రేణిగుంట విమానాశ్రయంకు ప్రత్యేక విమానంలో వచ్చిన సిఎం జగన్ అక్కడి నుండి హెలికాప్టర్ లో నెల్లూరులోని పోలీసు కవాతు మైనాదానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావు, గుంటూరు రేంజ్ ఐజి త్రివిక్రమ్ వర్మ, జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వర ప్రసాద్, కిలివేటి సంజీవయ్య తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం సిఎం జగన్ రోడ్డు మార్గాన సంతాప సభ జరిగే కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్ కు చేరుకున్నారు.

Read Previous

బ్లాక్ టిక్కెట్ల దందాపై బిజేవైఎం నిరసన… ఎస్ 2 థియేటర్ లో ఆందోళన

Read Next

మనసుకి కష్టంగా ఉంది… గౌతమ్‌రెడ్డి సంతాప సభలో సీఎం వైఎస్‌ జగన్‌ భావోద్వేగం

Leave a Reply

Your email address will not be published.