Clock Of Nellore ( Nellore ) – విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ చాలా అవసరమని నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగరంలోని ఏసి సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ఖోఖో, బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ టోర్నమెంట్ ను మేయర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో మాత్రమే రాణించాలని అనుకుంటారని, అది సరైన అభిప్రాయం కాదన్నారు. చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తేనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యార్థులు గుర్తింపు పొందుతారని తెలిపారు. క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వల్ల శారీరక సౌష్టవంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని పొందగలమని మేయర్ తెలిపారు. క్రమశిక్షణ, కృషి ఉంటే జీవితంలో అనుకున్న లక్ష్యానికి చేరుకోవచ్చని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ఉపయోగించుకుని ఆటల్లో విద్యార్థులు రాణించాలని మేయర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ద్వారకానాధ్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరిధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యన్. హరింధరప్రసాద్, ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ బోర్డు మెంబర్ కె. నరసింహులు, సెట్నెల్ మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి. పుల్లయ్య, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ఆర్.కె. యతిరాజ్, జిల్లా బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు డి. సుధాకర్, జిల్లా ఖో.ఖో. అసోసియేషన్ ప్రెసిడెంట్ యం. గిరిప్రసాద్, జిల్లా ఖో.ఖో. అసోసియేషన్ సెక్రటరీ యం. గురు ప్రసాద్, సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరి నిమ్మల వీరవెంకటేశ్వర్లు, జిల్లా PET అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జి. శ్రీనివాసులు (వాసు),హెడ్ క్వాటర్ సెక్రటరీ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
