Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరపాలక సంస్థ సర్వ సభ్య బడ్జెట్ ప్రత్యేక సమావేశము ఈనెల 30వ తేదీ ఉదయం 11 గం.లకు నిర్వహించనున్నట్లు కమిషనర్ దినేష్ కుమార్ శనివారం తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ ప్రత్యేక బడ్జెట్ సమావేశములో 2022 – 23 బడ్జెట్ అంచనాలను కౌన్సిల్ సమావేశ మందిరములో ప్రకటించనున్నామని తెలిపారు. మరో వైపు ప్రతీ సోమవారం నగర పాలక సంస్థలో నిర్వహించే స్పందన వేదికను కొన్ని అనివార్య కారణాల వల్ల ఈనెల 28 వ తేదిన రద్దు చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. రాబోవు ఏప్రిల్ నెలలో 4వ తేదీన తిరిగి యధావిధిగా స్పందన వేదికను నిర్వహిస్తామని కమిషనర్ వెల్లడించారు.