పాఠశాలలో పాము కలకలం… పరుగులు తీసిన ఉపాధ్యాయులు, విద్యార్ధులు

Clock Of Nellore ( Chejarla ) – నెల్లూరుజిల్లాలోని చేజర్ల మండలం, ఆదూరుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లో గురువారం ఓ పాము కలకలం సృష్ఠించింది. స్కూల్ ప్రారంభమైన కొద్ది సేపటికే తరగతి గదిలోకి 6 అడుగుల పొడవున్న ఓ పాము ప్రవేశించింది. పామును చూసి భయపడిపోయిన విద్యార్ధులు, ఉపాధ్యాయులు అక్కడి నుండి కేకలు వేస్తూ బయటకు వెళ్లిపోయారు. ఓ విద్యార్ధి ధైర్యం చేసి పామును చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ పక్కనున్న ఓ మరుగులో నుండి పాలు లోపలికి వచ్చినట్లు గుర్తించారు. మరుగును తొలగించాలని పంచాయితీ అధికారులకు ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు.

Read Previous

స్వచ్ఛభారత్ నిధుల విడుదలలో జాప్యం ఎందుకు ? – ప్రశ్నించిన ఎంపి ఆదాల

Read Next

తిరుమలలో భక్తుల రద్దీ… అలిపిరి తనిఖీ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి

Leave a Reply

Your email address will not be published.