నెల్లూరులో ఘనంగా రంగడి రథోత్సవం… పోటెత్తిన భక్త జనం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొని రంగనాథుణ్ని దర్శించుకున్నారు. ఉదయం ఉభయ దేవేరుల సమేత రంగనాథుడిని ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు తర్వాత దేవేరులను అలంకరించారు. అనంతరం రథంపైకి చేర్చారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ గమ్మడికాయతో రథానికి దిష్ఠితీసి ఉత్సవాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రంగనాయకులపేట ప్రాంతం ఇసుక వేస్తే రాలనంతగా మారిపోయింది. రథోత్సవంలో మంత్రితో పాటూ విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆలయ కమిటి ఛైర్మైన్ ఇలపాక శివకుమార్ ఆచారి, ఆగ్రో డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొణిదెల సుధీర్, కార్పొరేటర్ గుంజి జలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

వైసీపిలో చేరిన టిడిపి, జనసేన నేతలు… ఆహ్వానించిన కోటంరెడ్డి

Read Next

మంత్రి పెద్దిరెడ్డితో జడ్పీ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ భేటీ

Leave a Reply

Your email address will not be published.