పార్లమెంట్ లో ఎంపి ఆదాల ప్రశ్నలు… కేంద్రం సమాధానాలు..

Clock Of Nellore ( Delhi ) – ప్రస్తుత కాలంలో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ శాఖ అంచనా ఖచ్చితంగా ఉందా ? భారీ వర్షాలు రావడానికి గల కారణాలను గుర్తించిందా అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. ఈ విషయంలో శాస్త్రీయ పురోగతి ఉంటే దానికి ఆధారాలు తెలపాలని కూడా అడిగారు. దీనికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా సమాధానమిస్తూ భారత వాతావరణ విభాగం గత ఏడాది దక్షిణ రుతుపవనాల కాలానుగుణ చిత్రాలను అందించిందని తెలిపారు. నైరుతి రుతుపవన కాలంలో గమనించిన వర్షపాతం పంపిణీ చిత్రాల ప్రకారం సాధారణ వర్షపాతం కురిసినట్లు శాఖ అంచనా వేసిందని పేర్కొన్నారు. ఇచ్చిన మూడు చిత్రాల్లో 1 డి లో ఇచ్చిన వర్షపాతం అంచనాకు మించి 20 శాతం అదనంగా కురిసిందని తెలిపారు. గత ఏడాది అల్పపీడన వ్యవస్థల ద్వారా వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. వాతావరణ శాఖ విభాగం దేశంలోని వివిధ పరిశోధన సంస్థలతో కలిసి పని చేయడం ద్వారా దీర్ఘ శ్రేణి వ్యవస్థను రూపొందిస్తోందని తెలిపారు. ఎర్త్ సైన్సెస్ విభాగం రుతుపవన వర్షపాతం కోసం డైనమిక్ ప్రొడక్షన్ సిస్టంను అభివృద్ధి చేసేందుకు నేషనల్ మాన్సూన్ మిషన్ ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అన్ని వాతావరణాల ఆధారిత ప్రకృతి వైపరీత్యాల అంచనాలను నిర్వహిస్తూ సమర్థంగా పనిచేస్తోందని తెలిపారు.

సముద్రతీర ఖనిజానికి ఆమోదం ఇచ్చారా..
ఆంధ్రప్రదేశ్లోని 14 సముద్రతీర ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారా ? అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం ప్రశ్నించారు. ఈ లీజుకు ఆమోదం తెలపడానికి ఎంత వ్యవధి పడుతుందని కూడా అడిగారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దీనికి రాతపూర్వకంగా సమాధానం చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 17 ప్రతిపాదనలు అటామిక్ ఎనర్జీ విభాగానికి అందాయని తెలిపారు.18,367 హెక్టార్ల ప్రాంతంలో విశాఖ జిల్లాలోని భీమునిపట్నంలో 90.15 హెక్టార్లు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో 1978.471 హెక్టార్ల కోసం గత ఏడాది మార్చి 25, ఏప్రిల్ 15న లేఖలు అందాయని తెలిపారు. అయితే గత ఏడాది జూన్ 11న వచ్చిన ఒక లేఖ మేరకు సముద్రతీరంలో పర్యావరణానికి నష్టం కలిగించే చర్యలు, లీజు ఉల్లంఘనలపై లోతుగా పరిశీలించి వివరాలు అందించాలని కోరినట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న అదనపు సమాచారాన్ని కోరుతూ ఒక లేఖ రాసినట్లు తెలిపారు. దీనికి ఇంత వరకు సమాధానం అందలేదని పేర్కొన్నారు.

Read Previous

పారిశ్రామిక వేత్తలుగా ఎదగండి… ఎస్సీ, ఎస్టీలకు మేయర్ స్రవంతి పిలుపు

Read Next

అమరజీవికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఘన నివాళులు…

Leave a Reply

Your email address will not be published.