తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీరాములు త్యాగం : మేయర్

Clock Of Nellore ( Nellore ) – తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరకాలం నిలిచిపోతుందని, ఆయనను స్మరించుకోవడం తెలుగుజాతిని గౌరవించుకోవడంలా భావిస్తున్నట్లు నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ దినేష్ కుమార్ లు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని స్థానిక ఆత్మకూరు బస్టాండు కూడలిలోని ఆయన విగ్రహానికి వారు పూలమాలలు వేసి బుధవారం నివాళులు అర్పించారు. ఈ సందర్బం గా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఆ మహనీయుని సేవలను గుర్తిస్తూ జిల్లాకి ఆయన పేరును చేర్చడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు.

Read Previous

అమరజీవికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఘన నివాళులు…

Read Next

అమరజీవికి కలెక్టర్, ఎస్పీ ఘన నివాళులు…

Leave a Reply

Your email address will not be published.