సొంత డివిజన్ లో నాడు – నేడు పనులకు శ్రీకారం చుట్టిన మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 12వ డివిజన్ లోని ధనలక్ష్మీ పురం కృషి నగర్ లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు – నేడు రెండవ విడతలో భాగంగా జరుగుతున్న తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఒక కోటీ 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సౌకర్యవంతమైన తరగతి గదుల్లో విద్యార్థులకు అన్ని వసతులూ కల్పిస్తున్నామని, క్రమశిక్షణతో చదువుకుని రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులకు మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ సిపి నాయకులు, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Read Previous

జన్నత్ హుస్సేన్ నగర్ లో కోటంరెడ్డి, మేయర్ పర్యటన… సమస్యలపై ఆరా

Read Next

రోడ్డుపై వ్యక్తి దుర్మరణం… మరమ్మత్తులు చేయాలని బిజేపి నిరసన గళం

Leave a Reply

Your email address will not be published.