నెల్లూరుజిల్లాలో ఘనంగా వైసీపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

Clock Of Nellore ( Buero Report ) – నెల్లూరుజిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలు ఎక్కడికక్కడే పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కేకుల కట్ చేశారు. అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తదుపరి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు.

నెల్లూరు రూరల్ మండలంలోని ములుమూడిలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా పరిషత్ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ, డిసిసిబి మాజీ ఛైర్మైన్ ఆనం విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు ములుమూడికి వెళ్లిన ఆనం అరుణమ్మ, విజయకుమార్ రెడ్డిలకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు అంబరాన్నంటాయి. నెల్లూరులోని వారి కార్యాలయంలో వైసీపి జెండాను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపతానికి నివాళి అర్పించారు. అంతే కాకుండా దర్గామిట్టలోని విశ్వ భారతి అంధుల పాఠశాలలో అంధ విద్యార్ధులకు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. విద్యార్ధుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ స్రవంతి, ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వైసిపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

గూడూరు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి వర ప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్ – పర్సన్ పొణకా దేవసేనమ్మ, ఇతర వైసీపి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. కందుకూరులో స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ వైసీపి ఇంఛార్జ్ కొండ్రెడ్డి రంగారెడ్డితో కలిసి ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

Read Previous

ఈనెల 14న జనసేన పార్టీ ఛలో అమరావతి… పోస్టర్ ను ఆవిష్కరించిన కేతంరెడ్డి

Read Next

పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించండి – కమిషనర్ దినేష్ కుమార్

Leave a Reply

Your email address will not be published.