Clock Of Nellore ( Nellore ) – ఈనెల 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ దినోత్సవాన్ని అమరావతిలోని తాడేపల్లిలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల నుండి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలివెళ్లనున్నారు. నెల్లూరులో కార్యక్రమానికి సంభందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు ఆ పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి. తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి ఛలో అమరావతి పోస్టర్ ను విడుదల చేశారు.
అనంతరం వినోద్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ఆవిర్భావ సభను నిర్వహిస్తుందని చెప్పారు. ఈనెల 14వ తేదీ జరిగే ఈ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. కాబోయే ముఖ్యమంత్రి పనన్ కళ్యాణేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, కోవూరు జనసేన నాయకులు దాడి అజయ్, మహిళా విభాగం నాయకులు షేక్ ఆలియా, చింతంరెడ్డి శిరీషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.