Clock Of Nellore ( Nellore ) – ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వివిధ చోట్ల రోడ్లు భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ రోడ్ల మరమ్మత్తులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించారు. దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు పనులను గత నాలుగు రోజుల నుండి ప్రాంతాల వారీగా ప్రారంభిస్తున్నారు. గురువారం నెల్లూరు మూలాపేటలోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి పొట్టేపాళెం వరకూ 6 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నగర మేయర్ పోట్లూరి స్రవంతి, ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ నెలాఖరుకల్లా అన్నీ రహదారుల నిర్మాణం పూర్తవుతాయని చెప్పారు. భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బదిన్న రోడ్లపై ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులను తాను స్వయంగా చూశానని అందుకే ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చానని తెలిపారు. పొట్టే పాళెం వరకూ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత ములుమూడి – తాటిపర్తి రోడ్డును కూడా నిర్మాస్తామన్నారు. ప్రధాన రహదారులే కాకుండా కాలనీల్లో దెబ్బతిన్న రోడ్లకు కూడా మరమ్మత్తులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కోటంరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైసీపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
