వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మకత పెంపు – సైన్స్ ఫేర్ సందర్శనలో మేయర్

Clock Of Nellore ( Nellore ) – చిన్నారుల్లో సృజనాత్మక ధోరణి పెరిగేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పోట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగరంలోని బేతేలు వేళాంగణి మాత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో శనివారం నిర్వహించిన సైన్స్ ఫేర్ కు ఆమె ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సైన్స్ ఫేర్ లో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంకేతిక నమూనాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకంగా తయారు చేసిన నమూనాలు ప్రశంసించదగ్గవిగా ఉన్నాయని కొనియాడారు. విద్యార్థులంతా ఉత్తమ క్రమశిక్షణ కలిగి, విద్యతో పాటు క్రీడల్లో కూడా ఆసక్తి చూపించాలని, ఉన్నత పౌరులుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.

Read Previous

నెల్లూరులో రేపు నారీ సంకల్ప దీక్ష… ఏర్పాట్లు పరిశీలించిన టిడిపి నేతలు

Read Next

టిడ్కో గృహాలు అప్పగించండి… ఆత్మకూరులో లబ్ధిదారుల ఆందోళన

Leave a Reply

Your email address will not be published.