Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో ఇటీవల పదోన్నతి పొందిన 5 మంది ఎస్సైలకు, ముగ్గురు మహిళ ఏఎస్సైలకు పోస్టింగులు కేటాయించారు ఎస్పీ విజయరావు. పదోన్నతి పొందిన మరుసటి రోజే పోస్టింగులు ఇవ్వడంతో ఇవాళ వారంతా నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. మీరు కోరుకున్న చోట పోస్టింగులు కల్పించానని… విధి నిర్వహణలో నిక్కచ్ఛిగా ఉండాలని వారికి ఎస్పీ సూచించారు. అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలు చేయాలని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నపిల్లలు, వృద్దులు సమస్యలతో వచ్చినప్పుడు అలసత్వం ప్రదర్శించకుండా వారికి భరోసాగా నిలవాలన్నారు. ఎస్పీ మాటలతో వారంతా సంతోషం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.
