Clock Of Nellore ( Nellore ) – చిన్న చిన్న కుటుంబ కలహాలతో ఘర్షణ జరిగి తర్వాత నెల్లూరు ఎస్పీ విజయరావు కౌన్సిలింగ్ తో నేడు సంతోషంగా జీవిస్తున్న ఓ కుటుంబం ఎస్పీని కలిసి ధన్యవాదాలు తెలిపింది. ఇటీవల నెల్లూరు సిటీలోని కుద్ధూస్ నగర్ కు చెందిన ఓ మహిళ స్వయంగా ఎస్పీకి ఫోన్ చేసి భర్త వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. క్షణాల్లో అప్రమత్తమయిన ఎస్పీ సిబ్బందిని వారింటికి పంపి… భార్య భర్తను తన వద్దకు పిలిపించుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత వారు సంతోషంగా జీవించసాగారు. ఈ నేపద్యంలో ఇవాళ ఆ దంపతులు పిల్లలతో కలిసి నెల్లూరులో ఎస్పీని కలిశారు. మీ కౌన్సిలింగ్ వల్ల హ్యాపీగా ఉన్నామని పేర్కొని కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్పీ వారి పిల్లలకు బహుమతులు ఇచ్చి ఇలాగే ఉండాలని కాంక్షించారు.
