వైసీపిలో చేరికలు… యువతను పార్టీలోకి ఆహ్వానించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో పలువురు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపి విద్యార్ధి విభాగం నెల్లూరు నగర అధ్యక్షులు శేషు గౌడ్ ఆధ్వర్యంలో 21, 29 వ డివిజన్లకు చెందిన పలువురు యువకులు వైసీపిలో చేరారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాలతో పాటూ సిఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ గడపకూ చేరేలా కృషి చేయాలని కోరారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహించడంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుంటారని…. ఎందుకంటే ఆయన కూడా విద్యార్ధి రాజకీయాల నుండే ఈ దశకు ఎదిగారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ షేక్ సత్తార్, ఏఎంసి ఛైర్మన్ ఏసు నాయుడు, నేతలు సాయిరెడ్డి, హరిబాబు యాదవ్, సూరి, ఇస్మాయిల్ ఖాద్రీ, ఆరీఫ్, సంతుల్లా, అంజాద్, షాహిద్ పాల్గొన్నారు.

Read Previous

పిఆర్సీ చర్చలన్నీ నాటకమే… నెల్లూరులో ఓ ఉద్యోగి వినూత్న నిరసన

Read Next

బైక్ ను ఢీ కొట్టిన కారు… మహిళ మృతి

Leave a Reply

Your email address will not be published.