Clock Of Nellore ( Manubolu ) – సర్వేపల్లి నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలపకుండా నెల్లూరుజిల్లాలోనే కొనసాగిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ “జగనన్న వరం – సర్వేపల్లి జన నీరాజనం” పేరిట వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని అన్నీ మండల కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి సిఎం చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహిస్తున్నారు. తాజాగా శనివారం మనుబోలు మండల కేంద్రంలో రైతులతో కలిసి ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.

Tags: manubolu mla kakani