పలు డివిజన్లలో మంత్రి అనీల్ పర్యటన… ప్రజా హక్కు నిర్వహణ

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరులోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. 14వ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్, ఏసి నగర్, శ్రీనగర్, గిరిజన కాలనీల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి అనీల్ 6వ డివిజన్ లో పర్యటించారు. జీనిగలవారి వీధిలోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద అధికారులతో కలిసి ప్రజా హక్కు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను సావధానంగా విన్న మంత్రి ఆయా సమస్యలను అక్కడే ఉన్న ఆయా శాఖ అధికారులకు వివరించి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్, నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

మెరుగు పేరుతో బంగారంతో ఉడాయింపు… నాయుడుపేటలో సంఘటన

Read Next

జగనన్న వరం – జన నీరాజనం… సర్వేపల్లిలో రైతుల ర్యాలీ

Leave a Reply

Your email address will not be published.