Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నవాబుపేటలో ఉన్న బివిఎస్ బాలికల హైస్కూల్ ను అన్నీ విధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. శనివారం సాయంత్రం హైస్కూల్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హైస్కూల్ విద్యార్ధినులు మంత్రికి థ్యాంక్యూ అనీల్ అన్న అంటూ ప్లకార్డులు ప్రదర్శించి స్వాగతం పలికారు. స్కూల్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. స్కూల్ కు అడ్డుగా, విద్యార్ధినులకు అసౌకర్యంగా ఉన్నందునే బయట ఉన్న దుకాణాలను తొలగించామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. అనంతరం ఆయన నెల్లూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండ్ వద్ద నూతనంగా నిర్మించిన స్వచ్ఛ మరుగుదొడ్లను కమిషనర్ దినేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్లు కిన్నెర మాల్యాద్రి, మొగళ్లపల్లి కామాక్షిదేవి, షేక్ అస్మ, వైసీపి నేత సన్నపురెడ్డి పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




