Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు వేదాయపాళెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు హత్య కేసులకు సంభందించి ముద్దాయిలను అరెస్ట్ చేశారు పోలీసుల. ఈనెల 27వ తేదీ రాత్రి నగరంలోని పడారుపల్లి చలపతినగర్ ప్రాంతంలో ఆటో డ్రైవర్ కోటకొండ సునీల్ తనకు పరిచయమైన వ్యక్తులు నమ్మించి ఘటనా స్థలానికి తీసుకెళ్లి గొంతుకోసి చంపారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న అదే ప్రాంతానికి చెందిన తిరువళ్లూరు వినయకుమార్, దేవళ్ల వెంకటేష్, సముద్రాల మంజునాథ్, చెనికల లక్ష్మీ నారాయణ, షేక్ సుభాని అనే 5 మందిని వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అలాగే గత ఏడాది నవంబర్ 5వ తేదీ రాత్రి నగర శివారు సుందరయ్య కాలనీ హైవే జంక్షన్ వద్ద చిత్తూరుజిల్లాకు చెందిన లారీ డ్రైవర్ యనమల చంద్రశేఖర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. సుందరయ్య కాలనీ హైవే జంక్షన్ లో లారీ ఆపుకుని ఉన్న చంద్రశేఖర్ వద్ద డబ్బు దొంగిలించేదుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించగా అతని ఎదురుతిరగడంతో నిందితులు అతన్ని హత్య చేసి అతని వద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్ తో పరారయ్యారు. ఈ కేసులో నిందుతులైన సమీపంలోని సుందరయ్య కాలనీకి చెందిన తూపిలి గిరీష్ కుమార్, పంట సందీప్ రెడ్డి అనే ఇద్దర్నీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసు వివరాలను వేదాయపాళెం పోలీసులు మీడియాకు తెలియజేశారు.