Clock Of Nellore ( Kaligiri ) – ఎవరైనా ఎక్కడైనా పాలను కల్తీ చేసినా, కల్తీ పాలు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నెల్లూరుజిల్లాలోని కలిగిరి మండలం, జెర్రావారిపాళెంలో కల్తీ పాలు విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారిణి నర్మద ఆ గ్రామానికి వెళ్లి పాలను విక్రయిస్తున్న వారితో మాట్లాడారు. విక్రయిస్తున్న పాలను పరిశీలించారు. కల్తీ పాల వల్ల కలిగే అనర్ధాలను వారికి వివరించారు. పాల శాంపిళ్లను సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపారు. పాలు కల్తీ అయినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.