Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర వాసుల 25 ఏళ్ల కల నెరవేరింది. పెన్నానదిపై బ్యారేజీ పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయింది. ఈనెల 6వ తేదీనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యారేజీని జాతికి అంకితం చేయనున్నారు. నెల్లూరు బ్యారేజీ అద్భుతంగా తయారైంది. నగరంలో మరో టూరిజం ప్రాంతంగా మారింది. ప్రారంభోత్సవానికి ముందే నగర వాసులు పెద్ద ఎత్తున బ్యారేజీని సందర్శించి ఫోటోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో స్నేహితులతో పంచుకుంటున్నారు. నెల్లూరు నగరానికి సంభందించి ఇదో అద్భుతమనే చెప్పాలి. మరో వైపు ఈనెల 6వ తేదీనా బ్యారేజీ ప్రారంభోత్సవం నేపద్యంలో నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ శుక్రవారం దాన్ని సందర్శించి పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక నేపద్యంలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
