వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి – మహిళ మృతి, పలువురికి గాయాలు

Clock Of Nellore ( Atmakur ) – నెల్లూరుజిల్లా ఆత్మకూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక బంగ్లా సెంటర్ లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి జరిగింది. వేడుకల్లో భాగంగా ఉట్టి మహోత్సవం జరుగుతుండగా పక్కనే ఉన్న ఓ భవంతిపై ఎక్కి కొందరు దాన్ని తిలకిస్తూ ఉండగా… సన్ సైడ్ స్లాబు కూలింది. దీంతో దానిపై ఉన్న 20 మంది కింద పడ్డారు. అందరూ గాయపడగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా నీరజ అనే మహిళ మృతి చెందింది. సుజాత అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను నెల్లూరులోని జిజిహెచ్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Previous

జగనన్న కాలనీ పనులు పరిశీలించిన కొండూరు అజేయ్ రెడ్డి..

Read Next

ఈనెల 6న సిఎం నెల్లూరు జిల్లా పర్యటన : ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

Leave a Reply

Your email address will not be published.