Clock Of Nellore ( Nellore ) – ప్రవర్తన మార్చుకోవాలని పదే పదే చెబుతున్నా భార్య వినకపోయే సరికి మనస్థాపానికి గురైన భర్త… కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరులో గురువారం చోటుచేసుకుంది. నగర శివారు కొత్తూరు సమీపంలోని అంబాపురంలో రంగస్వామి అనే వ్యక్తి భార్యతో కలిసి కాపురం ఉంటున్నాడు. వారి ఇద్దరు కుమారులు. గత కొంత కాలంగా భార్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో హెచ్చరిస్తూ వచ్చాడు. దీనిపై పంచాయితీ రెండు దఫాలు పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లింది. పోలీసులు మందలించి పంపారు. తర్వాత కూడా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మనస్థాపానికి గురైనాడు. గురువారం ఉదయం ఇద్దరు పిల్లలను తీసుకొని సమీపంలో ఉన్న నేలబావి వద్దకు చేరుకున్నాడు. ఇద్దరుతో కలిసి బావిలోకి దూకగా ఓ కుమారుడు తప్పించుకున్నాడు. తప్పించుకున్న కుమారుడు సమీపంలోని ఇంటి వద్దకు వెళ్లి చుట్టుపక్కల వాళ్లకు తెలియజేశాడు. అక్కడి వారంతా గుంపుగా బావి వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. నెల్లూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలం చేరుకుని తాడు సాయంతో ఇద్దర్నీ బయటకు తీయగా అప్పటికే వారు మరణించి ఉన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, భార్య ప్రవర్తన వల్ల రంగస్వామి కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.