Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని టెక్కేమిట్ట వైపు నుండి మాగుంట లే అవుట్ వైపు వెళ్లే వాహన దారులకు ఇక్కట్లు వీడాయి. ఎన్నో ఏళ్ల నుండి ఎత్తుపల్లాలుగా, ప్రమాదకరంగా ఉన్న ఆ రహదారిని 15 రోజుల్లో బాగు చేయిస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఎత్తు పల్లాలుగా ఉన్న రోడ్డుకు పూర్తి స్థాయి మరమ్మత్తులు చేయించారు. బుధవారం నగర మేయర్ స్రవంతి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ దాసరి అమృతతో కలిసి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెప్పిన సమయానికి, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని గుర్తు చేశారు. ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం లభించిందని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల రోడ్ల మరమ్మత్తు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేవిఆర్ సెంటర్ నుండి అయ్యప్ప గుడి వరకూ ప్రధాన రహదారి పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని కోటంరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఛైర్మైన్ షేక్ సైదాని, నేతలు దాసరి రాజేష్, రియాజ్, సంధానీ, ఖలీల్, అశోక్, ఫరీదా, హుమియా, షెహనాజ్ తదితరులు పాల్గొన్నారు.
