నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా హరిత – జాహ్నవి బదిలీ – మరి కొందరు కూడా

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాకు సంభందించి ఇద్దరు అధికారులు బదిలీ కాగా, ముగ్గురు అధికారులు కొత్తగా నియమితులైనారు. నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవిని బదిలీ చేశారు. ఆమె స్థానంలో కమిషనర్ గా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్డీఓగా ఉన్న డి. హరితను నియమించారు. హరిత గతంలో నెల్లూరు ఆర్డీఓగా పనిచేసి ఉన్నారు. బదిలీ అయిన జాహ్నవికి ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదు. నెల్లూరు ఆర్డీఓ పి. కొండయ్యను సత్యసాయి జిల్లా డిఆర్వోగా బదిలీ చేశారు. నెల్లూరు ఆర్డీఓగా పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఎ. మలోలను నియమించారు. ఖాళీగా ఉన్న ఆత్మకూరు ఆర్డీఓ పోస్టులో వెయిటింగ్ లో ఉన్న ఎస్. కరుణకుమారిని నియమించారు.

Read Previous

రొట్టెల పండుగను విజయవంతం చేద్ధాం : సమీక్షలో ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

వైసీపిలో చేరిన సిపిఎం నేతలు – ఆహ్వానించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published.