వైసీపిలో చేరిన సిపిఎం నేతలు – ఆహ్వానించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు 18వ డివిజన్ కు చెందిన సిపిఎం నేత దార్ల శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో… వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో దార్ల శ్రీనివాసులు వారి మిత్ర బృందం వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందుకే అనేక మంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, వారి వారి ప్రాంతాల్లో ఏ సమస్య ఉన్నా వాటిని తమ దృష్ఠికి తీసుకొస్తే వారిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ అశోక్ నాయుడు, మాజీ కార్పొరేటర్ దారా వంశీ, మారంరెడ్డి కుమార్ రెడ్డి, లక్ష్మయ్య, కృష్ణ, శ్రీను, మీరాలు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా హరిత – జాహ్నవి బదిలీ – మరి కొందరు కూడా

Read Next

నేడు ప్రపంచ హైపటైటిస్ దినోత్సవం… మెడికవర్ లో 3వేలకే అన్నీ రకాల పరీక్షలు

Leave a Reply

Your email address will not be published.