నెల రోజుల్లోగా జగనన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయండి – అధికారులకు కలెక్టర్ ఆదేశం

Clock Of Nellore ( Buchi ) – నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీల్లో ( YSR Jagananna Colony ) చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలోని నాగమాంబపురం, కట్టుబడిపాలెం గ్రామాల్లోని జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ళ నిర్మాణాల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్, నాగమాంబపురం వద్ద జగనన్న కాలనీలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించి, ఆగస్టు నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ లే అవుట్లో మొత్తం 60 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, అందులో బిలో బేస్మెంట్ స్థాయిలో 8, బేస్మెంట్ స్థాయిలో 25 ,రూఫ్ లెవెల్ లో 12, స్లాబ్ వేసినవి 15 గృహాలు మొత్తం 60 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని గృహనిర్మాణ శాఖ ఏ.ఈ, జిల్లా కలెక్టర్ కు వివరించారు. వివిధ దశల్లో వున్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను, కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ళ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు స్టేజీ అప్డేషన్ చేయాలన్నారు. తుది దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి ఆగస్టు 15 నాటికి సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. లే అవుట్ నందు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అక్కడి లబ్ధిదారులను ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ పరిధిలోని కట్టుబడిపాలెం జగనన్న కాలనీలో చేపట్టిన ఇళ్ళ నిర్మాణాల పురోగతిని కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. ఆగస్టు నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటూ కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్, మండల ప్రత్యేక అధికారిని, హౌసింగ్ అధికారులను, మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. రోజు వారీ లక్ష్యాలను నిర్ధేశించుకొని ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయుటకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి, సమగ్ర శిక్ష పిఓ ఉషా రాణి, హౌసింగ్ పిడి నరసింహులు, మునిసిపల్ కమీషనర్ శ్రీనివాసులు, తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి, ఎంపీడీఓ నరసింహా రావు, హౌసింగ్ ఈ ఈ శ్రీ గౌస్ మోహిద్దీన్, విద్యుత్ శాఖ, ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read Previous

జోరువానలోనూ గడప గడపకు తిరుగుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

పవన్ సిఎం కాగానే సిపిఎస్ రద్దు – ప్రజాబాటలో కేతంరెడ్డి వెల్లడి

One Comment

  • గౌ, శ్రీ, K V N CHAKRADHAR BABU IAS గారు . మంచి పరి పాలనా అధికారి గా మన జిల్లా కి రాష్ట్రస్థాయిలో ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకోవచ్చని నారు.

    క్రింది స్థాయి అధికారులు సరైన ప్రణాళికలు పాటించకపోవడం వలన ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి.

    కలెక్టర్ గారు అధికారులకు ఎన్నిసార్లు సూచనలు చేసినా కూడా క్రింది స్థాయి అధికారులు పాటించకపోవడం అనేది మనం ప్రింట్ మీడియాలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ చూస్తూనే ఉన్నాం.

Leave a Reply

Your email address will not be published.