ద్వై వార్షిక నగదు – లబ్ధిదారులకు అందజేసిన కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore ) – నవరత్నాలు – ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమాన్ని తాడేపల్లి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా మంగళవారం ప్రారంభించారు. లబ్దిదారులనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వివిధ కారణాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందలేని అర్హులైన వారందరికి నగదు పంపిణి చేస్తున్నామని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంతో ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. అర్హులైన లబ్దిదారులందరికి ఆయా పధకాల ద్వారా ఆర్థికభరోసా కల్పిస్తున్నామని చెప్పారు.

నెల్లూరు కలెక్టరేట్ నుండి ఈ వీడియో కాన్ఫెరెన్సుకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా గ్రామీణాబివృద్ది సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివా రెడ్డి, మెప్మా పి.డి రవీంద్ర, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ జె.డి.లు సుధాకర్ రాజు, నాగేశ్వర రావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రమాదేవి, డి.ఎస్.డబ్ల్యూ.ఓ వెంకటయ్య, వివిధ సంక్షేమ పధకాల లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జిల్లాకు సంబంధించి నవరత్నాలు – ద్వైవార్షిక నగదు మంజూరు లో భాగంగా వివిధ పధకాల కింద అర్హులైన 5,627 మంది లబ్ధిదారులకు సంబందించి రూ.5,32,52,299/-ల చెక్కును, వైఎస్.ఆర్. మత్స్య కారా భరోసా పధకం కింద 1,540 మంది లబ్ధిదారులకు సంబందించి 1.54 కోట్ల రుపాయల చెక్కును, మరియు జగనన్న వసతి/ విద్యా దీవెన కింద 2,204 మంది లబ్ధిదారులకు సంబందించి రూ. 1,73,68,044/-ల చెక్కును జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, లబ్ధిదారులకు అందజేసారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, నవరత్నాల కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాలకు సంబందించి అర్హుత ఉండి ఏ కారణం చేతనైన సంక్షేమ పధకం అందని వారికి మరొక అవకాశం ఇస్తూ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సంబందించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ పధకాలకు సంబంధించి 3,39,096 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 136.92 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. సంక్షేమ పధకం ప్రారంభించి నప్పుడు ఎవరికైతే అర్హుత ఉండి సాంకేతిక కారణాల వలన సంక్షేమ పధకం అందలేదో వారిని గుర్తించి గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ప్రొసెస్ చేసి ద్వై వార్షిక కార్యక్రమం కింద వారికి సంక్షేమ పధకాలు అందచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో 13 సంక్షేమ పధకాలకు సంబందించి 6400 మంది లబ్ధదారులకు సుమారు 6 కోట్ల 50 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని నేరుగా వారి అకౌంట్లో ఈ రోజు జమచేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. అంతేకాకుండా మరో 13 వేల మందికి కొత్తగా వై.ఎస్.ఆర్ పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ద్వై వార్షిక కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, అర్హుత ఉండి ఏ కారణం చేతనైన సంక్షేమ పధకం అందని వారికి సంబందించి డిసెంబర్ నుండి మే నెల వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జులై నెలలో లబ్ధిదారులకు సంక్షేమ పధకం అందచేయడం జరుగుతుందని, అలాగే జూన్ నుండి నవంబర్ మాసం వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి డిసెంబర్ మాసంలో లబ్ధిదారులకు సంక్షేమ పధకం అందచేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.

Read Previous

సముద్రపు ముఖ ద్వారాన్ని తెరిచే కార్యక్రమం ఏమైంది ? – కేంద్రాన్ని ప్రశ్నించిన ఆదాల

Read Next

స్వంత నిధులతో సీసీ కెమరాల ఏర్పాటు… ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.