Clock Of Nellore ( Nellore ) – ఆరోగ్యం సరిగా లేక సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్న పలువురు నిరుపేదలకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 42 మందికి 35 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. నగరంలోని రాజన్న భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్, కార్పొరేటర్లు వేలూరు మహేష్, పోట్లూరి రామకృష్ణ, నీలి రాఘవరావు, ఊటుకూరు నాగార్జున, గుంజి జయలక్ష్మి, వైసీపి నేతలు ఇంతియాజ్, కాయల సురేష్, షేక్ ముజీర్, కొణిదెల సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
