నెల్లూరుజిల్లాలో చోళకాలం నాటి అరుదైన శాసనం లభ్యం

Clock Of Nellore ( Kovur ) – నెల్లూరుజిల్లాలో వెయ్యేళ్ల క్రితం చోళ కాలం నాటి శాసనం బయటపడింది. క్రీస్తు శకం 1169 వ సంవత్సరం నాటి మొదటి కులోత్తుంగ చోళరాజు యొక్క 21వ పరిపాలనా కాలం నాటి అరుదైన శాసనంగా చరిత్ర అధ్యాపకులు డాక్టర్ గోవిందు సురేంద్ర ధృవీకరించారు. వివరాల్లో కెళ్తే… నెల్లూరు జిల్లా కోవూరు మండలం, వేగూరులోని శ్రీ కైలాసనాథ ఆలయంలో ఉన్న ఈ రాతి శాసనాన్ని గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు గూడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకులు డాక్టర్ గోవిందు సురేంద్ర గత కొద్ది రోజులుగా పరిశీలించి దానిపై అధ్యయనం చేశారు. రాతి శాసనంపై ఉన్న అక్షరాలు, ఇతర కళాఖండాలపై లోతైన అధ్యయనం చేసి ఆదివారం దానిపై ప్రకటన చేశారు. వెయ్యేళ్ల క్రితం నాటి చోళ కాలం శాసనంగా ధృవీకరించారు.

క్రీస్తు శకం 1169 సంవత్సరం నాటి మొదటి కులోత్తుంగ చోళరాజు యొక్క 21వ పరిపాలనా కాలం నాటిది శాసనంగా ధృవీకరించారు. అమావాసిపడి జరిపేందుకు సేవన్ బోయిందన్ అనే వ్యక్తి 330 కులి భూమిని 20 సాన్ కోలుతో తంటి బోయిందాన్ సమక్షంలో కొలచి కైలాస నాధునికి దానంగా ఇచ్చారని, దక్షిణ భారతదేశంలో లభించిన శాసనాల్లో కెల్లా ఇది అరుదైనది అని డాక్టర్ గోవిందు సురేంద్ర చెప్పారు. ఈ శాసనం పై భాగానా ద్విముఖ నందీశ్వరుడు దానికి ఎదురుగా త్రిశూలం, అంకుశం ( గొడ్డలి ) రేఖా చిత్రాలతో ఉందని ఇది ఎంతో ప్రసిద్ధి పొందిందింగా పేర్కొన్నారు. ఎంతో ప్రాచీనత కలిగిన ఈ శాసనంతో పాటూ మరో శాసనం కూడా ఉన్నట్లు రికార్డుల్లో ఉందని అయితే మరో శాసనం లభించలేదని వివరించారు. రాష్ట్ర పురావస్తు శాఖ దీన్ని సంరక్షించి భావితరాలకు వారసత్వంగా అందివ్వాలని విజ్ఞప్తి చేశారు.

Read Previous

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన HDFC బ్యాంకు సిబ్బంది

Read Next

నెల్లూరు జడ్పీ సర్వసభ్య సమావేశం : రోడ్ల దుస్థితిపై ఏకరువు పెట్టిన ఎమ్మెల్యేలు

Leave a Reply

Your email address will not be published.