ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన HDFC బ్యాంకు సిబ్బంది

Clock Of Nellore ( Kovur ) – పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెల్లూరు HDFC హోల్ సేల్ బ్యాంకింగ్ శాఖ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా కోవూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను దత్తత తీసుకుని అక్కడ పూర్తి స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం కళాశాలలో బ్యాంక్ సిబ్బంది 100 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ క్లస్టర్ హెడ్ శ్రీనివాసరావు గుప్తా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో విశేష సేవలందిస్తూనే HDFC బ్యాంక్ ప్రజా ప్రయోజన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుందని అన్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటే కార్యక్రమాన్ని విరివిగా చేపడుతుందని, కోవూరు డిగ్రీ కళాశాలలో తామే పూర్తిస్థాయిలో మొక్కలు నాటి పెంచనున్నట్లు తెలియజేశారు.

 

Read Previous

ఆనం వెంకటరమణారెడ్డి హౌస్ అరెస్ట్… ఆగ్రహం వ్యక్తం చేసిన ఏవిఆర్

Read Next

నెల్లూరుజిల్లాలో చోళకాలం నాటి అరుదైన శాసనం లభ్యం

Leave a Reply

Your email address will not be published.