Clock Of Nellore ( Nellore ) – ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో కొన్ని ప్రాంతాల్లో వానా కాలం మొదలైంది. ఈ వర్షకాలం అందరికీ మంచి హాయిని ఇచ్చినప్పడికీ పలు రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. సీజన్ బట్టి, మన శరీరంలో కూడా మార్పులు జరుగుతుంటాయి. వర్షా కాలంలో ఎదురయ్యే సమస్యలపై ప్రజలకు పలు సూచనలు చేశారు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎస్.కె. ఫిరోజ్ ( Nellore Medicover Hospital )… ఆయన మాటల్లోనే… ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు రావడం. శరీరంలో రక్త ప్రసరణ స్తంభించడం వంటి సమస్యలు రావడం, వర్షాల కారణంగా చర్మంపై సెబమ్ గ్రంథులలో సమస్యలు వచ్చి చర్మ సమస్య పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆయిల్ స్కిన్ ఉన్న వారు తీవ్ర చర్మ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నారు. మలేరియా, టైఫాయిడ్, కలరా ఇలా మరెన్నో సీజనల్ వ్యాధులు వేధిస్తాయి. కొన్ని అంతుబట్టని వ్యాధులు సైతం తమ ఉనికి చాటుతాయి. ఈ నేపథ్యంలో వర్షకాలంలో ఏర్పడే ప్రమాదకర వ్యాధులు, వాటి లక్షణాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ చిన్నారులు రొంప, దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలను బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.
మలేరియా : మురుగు లేదా నిల్వ నీటిలో ఏర్పడే ఆడ అనోఫెల్స్ దోమ వల్ల ఏర్పడుతుంది.దీనివల్ల చలి , జ్వరం , కడుపులో నొప్పి , ఒళ్ళు నొప్పులు , అతిగా చెమటలు పట్టడం వంటి లక్షణాలతో బాధపడతారు.
దగ్గు మరియు వైరల్ జ్వరం : ఇది ఒక అంటువ్యాధి. దీనివల్ల గొంతు నొప్పి, కండరాలు నొప్పులు , ఆయాసం మరియు ముక్కు కారడం వంటివాటితో బాధపడతారు.
డయేరియా మరియు టైఫాయిడ్ : కలుషిత నీరు మరియు ఆహారం వల్ల వస్తుంది.ఆయాసం, తిమ్ముర్లు, వాంతులు, నీరసం, తలనొప్పి, గొంతు నొప్పి జ్వరం వంటి వాటితో బాధపడతారు.
లెప్టోస్పిరోసిస్ : శరీరంపై గాయాలున్నవారు మురికి నీరులో నడిస్తే వస్తుంది. దీనివల్ల తలనొప్పి, కళ్ళనొప్పి, శరీరం బిగుతుగా అనిపించడం, జ్వరం వస్తుంది.
సీజన్ బట్టే మనం శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచే ఆహారాలను తీసుకోవల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో వ్యాధినిరోధకత చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలా త్వరగా జబ్బున పడుతుంటారు. ముఖ్యంగా వార్షాకాలంలో మరింత వేగంగా జబ్బులు చుట్టుముడుతుంటాయి. వర్షాకాలంలో పిల్లల్లో ఇమ్యూనిటి పెంచాలన్నా, ఇన్ఫెక్షన్ల బారీ నుండి తప్పించుకోవాలన్నా వారికి మూన్ సూన్ ఫుడ్స్ ను అందివ్వడమే. అంటే వారిలో రోగనిరధక శక్తి పెంచే ఆహారాలు అందివ్వడం చాలా అవసరం. శరీరంలో అంతర్గతంగా స్ట్రాంగ్ గా ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్స్ మరియు వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. మనం రెగ్యులర్ గా తీసుకొనే హెల్తీ డైట్ కంటే మాన్ సూన్ ఫుడ్స్ కు పెద్ద డిఫరెంట్ ఏమి ఉండవు. కానీ, వర్షకాలంలో కొద్దిగా ఎక్కువ, అదనపు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎప్పుడూ హోం మేడ్ ఫుడ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఏలాంటి జబ్బులు ధరించేరకుండా చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో తీసుకొనే పండ్లు మరియు వెజిటేబుల్స్ ను శుభ్రంగా కడిగి తీసుకోవడం మంచిది. అంతే కాకుండా, వెనిగర్ మిక్స్ చేసిన నీటిలో పండ్లు మరియు వెజిటేబుల్స్ ను నానబెట్టి తర్వాత శుభ్రంగా కడిగి తీసుకోవాలి . ఇలా చేయడం వల్ల వాటి మీద ఉండే దుమ్ము, ధూళి, ఇతర సూక్ష్మక్రిములు తొలగిపోయి, క్లీన్ గా ఉంటాయి. చిన్న పిల్లలు రోజు గుడ్లు , ఫ్రెష్ ఫ్రూట్స్ , బాదం వంటి ఆహారపదార్దాలు తీసుకోవడం మంచిది.
జాగ్రత్తలు :
– తినేముందు చేతులు శుభ్రంగా కడుకోవాలి.
– వేడి ఉన్న వంటలను మాత్రమే తినాలి. పాచి కూరగాయలు తినవద్దు.
– మరిగించి చల్లార్చిన నీరు తాగండి.
– నిండుగా దుస్తులు ధరించండి.
– శరీరం పై గాయాలుంటే మురికి నీటిలో వెళ్ళకండి.
– ఇళ్ల పరిసరాళ్లలో నీరు నిల్వ లేకుండా చుడండి. వాటివల్ల దోమలు వస్తాయి, వాటి ద్వారా రోగాలు వస్తాయి.
