ఫోన్ కాల్ కు స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి… ఆ ప్రాంతానికి పయనం

Clock Of Nellore ( Nellore ) – తమ ప్రాంతంలో సమస్యలు తాండవం చేస్తున్నాయని ఓ వ్యక్తి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేశారు. దీంతో స్పందించిన కోటంరెడ్డి హుటాహుటిన నెల్లూరు 18వ డివిజన్ కు చేరుకున్నారు. వెంకటరెడ్డి నగర్, రాజీవ్ గాంధీ కాలనీలో పర్యటించి ఫోన్ చేసిన వ్యక్తితో కలిసి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తాగునీరు సరిగా రావడం లేదని, విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్ఠికి తీసుకెళ్లారు. మోటార్లు మరమ్మత్తులకు గురవ్వడం వల్ల సమస్య ఏర్పడిందని రేపటి కల్లా మోటార్లు రిపేరు చేస్తారని ఆలోగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ లో రోడ్ల మరమ్మత్తులకు 62కోట్లు మంజూరు చేశారని, రోడ్లను త్వరలోనే నిర్మిస్తామని, అంతర్గత రహదారులు కూడా నిర్మిస్తామన్నారు. విద్యుత్ సమస్యపై కూడా అధికారులతో చర్చిస్తానన్నారు. ఫోన్ చేసిన వెంటనే స్పందించి తమ ప్రాంతానికి వచ్చినందకులు స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ అశోక్ నాయుడు, వైసీపి నేతలు మదన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరు జేసీగా బాధ్యతలు చేపట్టిన కూర్మనాథ్…

Read Next

గ్రంధాలయాల్లో డిజిటల్ పుస్తకాలు… వెల్లడించిన దొంతు శారద

Leave a Reply

Your email address will not be published.