Clock Of Nellore ( Tirupathi ) – ప్రజల్లో అత్యధిక ఆదరణ కలిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని వైసీపి రాష్ట్ర కార్యదర్శి, తిరుపతి నియోజకవర్గ వైసీపి ప్లీనరీ పరిశీలకులు ఆనం విజయకుమార్ రెడ్డి అన్నారు. శనివారం తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తిరుపతి నియోజకవర్గ వైసీపి ప్లీనరీ సమావేశాల్లో ఆనం విజయకుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సంక్షేమం అన్న పదానికి అసలైన నిర్వచనం చెబుతూ ఆచరణలో అమలు చేస్తున్న వ్యక్తి సిఎం జగన్ అని కొనియాడారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ జగనే ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. సిఎం జగన్ సారధ్యంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలంతా అదృష్ఠవంతులని వెల్లడించారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా వైసీపి అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, తిరుపతి ఎంపి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
