ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ – పోలింగ్ 70 శాతం పైనే

Clock Of Nellore ( Atmakur ) – నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలోని మొత్తం 279 కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ పోలింగ్ మందకొడిగా సాగింది. అత్యధికంగా మహిళా ఓటర్లు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు 44.14 శాతంగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ శాతం 61.70 శాతంగా నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ సాగింది. 6 గంటలకు కూడా క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు హక్కును కల్పించారు. పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు రాత్రి 7 గంటల వరకూ సమయం పట్టవచ్చునని అంచనా వేస్తున్నారు. మొత్తం 70 శాతం వరకూ పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 26వ తేదీనా ఓట్ల లెక్కింపు జరగనుంది.

Read Previous

నమ్ముకున్న యువతను నట్టేటా ముంచిన వైసీపి – ఆరోపించిన కేతంరెడ్డి

Read Next

నెల్లూరుజిల్లాలో దంపతుల ఆత్మహత్యా యత్నం… వెనుక భరించరాని దారుణం

Leave a Reply

Your email address will not be published.