చింతారెడ్డిపాళెంలో గడప గడపకు కార్పొరేటర్… మేయర్ కు ఘన స్వాగతం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలతో సంక్షేమ పాలన అమలు తీరును తెలుసుకునేందుకు రూపొందించిన వినూత్న కార్యక్రమం “శ్రీధరన్న మాట – గడప గడపకు మీ కార్పొరేటర్ బాట” ద్వారా ప్రజలందరినీ కలుసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని నగర మేయర్ స్రవంతి పేర్కొన్నారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న 12 వ డివిజన్ చింతారెడ్డి పాళెంలో గురువారం గడప గడపకు కార్పొరేటర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వివిధ సమస్యలను మేయర్ అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరును, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు అందిస్తున్న సేవలను ప్రతి ఇంటికి తిరిగి విచారించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సూచించారు. సంక్షేమ పథకాల అమలులో సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు అందిస్తున్న సేవలు అత్యంత కీలకమని, స్థానిక సమస్యల పరిష్కారానికి వారు చేస్తున్న కృషి అభినందనీయమని మేయర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వై.సీ.పీ నాయకులు జయవర్ధన్, యషయ్య, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ను పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు

Read Next

నమ్ముకున్న యువతను నట్టేటా ముంచిన వైసీపి – ఆరోపించిన కేతంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.