వారిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయండి – ఎమ్మెల్యే కోటంరెడ్డి డిమాండ్

Clock Of Nellore ( Nellore ) – మహ్మద్ ప్రవక్తతో పాటూ ఇస్లాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నవీన్ జిందాల్, నఫూర్ శర్మపై దేశ ద్రోహం క్రింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేేశారు. ఆదివారం నెల్లూరులోని వారి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వారు చేసిన వ్యాఖ్యలు భారతీయ సమాజాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు. విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు కలిసి వసుదైక కుటుంబంగా విరాజిల్లుతున్న భారతీయ సమాజంలో ఇలాంటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య విఘాతం కలిగిస్తాయని, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన నఫూర్ శర్మ, నవీన్ జిందాల్ పై నామమాత్రపు చర్యలు కాకుండా దేశ ద్రోహం నేరం క్రింద కేసులు నమోదు చేసి జైళ్లకు పంపాలని కోరారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే వ్యక్తులకు టెర్రరిస్టులకు తేడా లేదని, టెర్రరిస్టుల మీద చర్యలు తీసుకుంటారో వారిపై కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Read Previous

నెల్లూరు జిజిహెచ్ లో నూతన కార్మిక సంఘం ఏర్పాటు…

Read Next

నెల్లూరుజిల్లాలో సిఎం జగన్… నూతన వధూవరులకు ఆశీర్వాదం

One Comment

  • హిందూ దేవుళ్ళని ఇతర మతాల వాళ్ళు అవమానించినప్పుడు కళ్ళు చెవులు పోయాయి mla గారికి పాపం..అదే ఖురాన్ లో చెప్పినవి చెప్పినా బాధపడిపోతున్నారు

Leave a Reply

Your email address will not be published.