Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం నెల్లూరుజిల్లా కావలికి విచ్చేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ కు ఆయన హజరయ్యి నూతన వధూవరులకు తన ఆశీర్వాదాలు అందజేశారు. తాడేపల్లి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో కావలి సమీపంలోని గౌరవరం వద్ద ఏర్పాటు చేసిన రిసెప్షన్ ప్రాంతానికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న సిఎం జగన్ కు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వేదికపైకి చేరుకున్న సిఎం జగన్ నూతన వధూవరులకు పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటూ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన హెలికాప్టర్ లో తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు.
