Clock Of Nellore ( Nellore ) – రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీదా మస్తాన్ రావు ( Rajya Sabha MP Beedha Masthan Rao )… నెల్లూరుజిల్లాలోని పలువురు ప్రజా ప్రతినిధులను మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి వారి నివాసంలో కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా బీదా మస్తాన్ రావును ఎంపి ఆదాల సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత మాజీ మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. తర్వాత అనీల్ కుమార్ యాదవ్ బీదా మస్తాన్ రావును శాలువాతో సత్కరించి రాజ్యసభకు ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బీదా మస్తాన్ రావు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరూ కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వారి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా బీదా మస్తాన్ రావు కోటంరెడ్డికి ధన్యవాదాలు తెలియజేసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

