Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వృద్ధాప్యం ఆధారంగా పెన్షన్లు మంజూరు చేసేవారని, పిల్లలు పట్టించుకోకుండా అనేక ఇబ్బందులు పడే వృద్ధ తల్లిదండ్రులకు ఆ పెన్షన్ ఎంతో ఆదరవుగా ఉండేదని నెల్లూరు జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. రాజన్న రాజ్యం పేరుతో పరిపాలన సాగిస్తున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి భిన్నంగా రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ అంటూ ఉన్న పెన్షన్లను కూడా తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా ఆయన మంగళవారం మైపాడు రోడ్డులోని బాలకృష్ణ స్టోర్ వీధిలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు తమ పెన్షన్లను తొలగించాలని కేతంరెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందికైతే కారణాలు లేకుండానే పెన్షన్లు తొలగించారన్నారు. 80 ఏళ్ల వృద్ధులను కూడా ఇబ్బంది పెడుతూ వయస్సు ధృవీకరణ పత్రాలు తెమ్మని షరతులు విధిస్తున్నారని, తక్షణం ప్రభుత్వం స్పందించి ఎలాంటి షరతులు లేకుండా వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
