Clock Of Nellore ( Nellore ) – మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో జరుగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపి అభ్యర్ధిగా బరిలో నిలుస్తున్న మేకపాటి విక్రమ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు నెల్లూరు జడ్పీ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ, వైసీపి రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి. నెల్లూరులోని వారి నివాసానికి వెళ్లి విక్రమ్ రెడ్డికి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డితో కొద్దిసేపు వివిధ అంశాలపై చర్చించారు.
