నెల్లూరు నగరంలో పట్టపగలు దారుణం : యువకుడికి కత్తిపోట్లు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న ఓ యువకుడ్ని ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి పరారయ్యారు. వివరాల్లో కెళ్తే… నగరంలోని టౌన్ హాల్ ఎదురుగా ఉన్న దండువారి వీధిలో విజయ్ అనే యువకుడు ఓ టీషాప్ వద్ద ఉండగా ఇద్దరు వ్యక్తులు అతని వద్దకొచ్చి కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. కత్తిపోట్లతో అక్కడికక్కడే విజయ్ కుప్పకూలడంతో వారు సమీపంలో సిద్దంగా ఉన్న స్కూటర్ పై పరారయ్యారు. స్థానికులు చిన్నబజార్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న విజయ్ ను పోలీసు వాహనంలో జిజిహెచ్ కు తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో వైపు విషయం తెలుసుకున్న జిల్లా అదనపు ఎస్పీ హిమవతి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దగ్గర్లోని దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన సిసి టివి కెమరాల ఫుటేజిని సేకరించారు. పాత కక్షల నేపద్యంలో ఈ దారుణం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read Previous

నెల్లూరులో రాష్ట్ర స్థాయి బిలియర్డ్స్ పోటీలు – ప్రారంభించిన మలిరెడ్డి కోటారెడ్డి

Read Next

కిలాడీ లేడీలను అరెస్ట్ చేసిన నెల్లూరు జిల్లా పోలీసులు…

Leave a Reply

Your email address will not be published.