గడప గడపకు మన ప్రభుత్వం – నెల్లూరు రూరల్ లో విస్త్రృతం

Clock Of Nellore ( Nellore Rural ) – నెల్లూరు రూరల్ మండల పరిధిలోని కొమ్మరపూడి గ్రామంలో ఇప్పటివరకు 1.44 కోట్ల రూపాయలతో సంక్షేమ పధకాలు, 1.78 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని, పెండింగ్ పనులను త్వరలో పూర్తి చేస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ” గడప గడపకు మన ప్రభుత్వం ” కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజక వర్గ పరిధిలోని కొమ్మరపూడి గ్రామంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించి, ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి పథకాలు అందని వారు ఉంటే, వారి వివరాలు సేకరించి పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి సూచించారు. అలాగే ప్రజల నుండి తమ దృష్టికి వచ్చిన ఇతర సమస్యలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ తహశీల్దార్ షఫీ, ఎం.పి.డి.ఓ వసుమతి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 

Read Previous

6వ డివిజన్ లో పర్యటించిన మాజీ మంత్రి అనీల్… సమస్యలపై ఆరా

Read Next

కార్మికులకు అండగా ఉంటా… మీ సమస్యలు పరిష్కరిస్తా… మేయర్ హామీ

Leave a Reply

Your email address will not be published.