Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో 7 మంది ఎస్సైలను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ విజయరావు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో మహిళా ఎస్సైగా పనిచేస్తున్న కె. స్వప్నను నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. నెల్లూరులోని దిశ పోలీస్ స్టేష్ లో మహిళా ఎస్సైగా ఉన్న పి. ఆదిలక్ష్మిని కావలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. కావలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై బాజీబాబును నెల్లూరు దర్గామిట్ట పిఎస్ కు బదిలీ చేశారు. నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్ ఎస్సై కె. శేఖర్ బాబును, నగరంలోని చిన్నబజారు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. నెల్లూరు వేదాయపాళెం పిఎస్ లో పనిచేస్తున్న ఎస్సై ఎస్.కె. ఖాజావలిని కొండాపురం పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. నెల్లూరు స్పెషన్ బ్రాంచ్ లో ఎస్సైగా ఉన్న కె. ప్రసాద్ రెడ్డిని చేజర్ల పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయగా, కొండాపురం పోలీస్ స్టేషన్ ఎస్సై జె. మాల్యాద్రిని విఆర్ కు బదిలీ చేస్తూ ఎస్పీ విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం కేటాయించిన స్టేషన్లలో బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు.