Clock Of Nellore ( Nellore Rural ) – ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పధకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం నెల్లూరు రూరల్ నియోజక వర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో కోటంరెడ్డి పర్యటించి, ప్రతి కుటుంబం వద్దకు వెళ్ళి ప్రభుత్వ పధకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏవైనా సమస్యలు వున్నాయా అని అడిగి తెలుసుకొని, ఏవైనా సమస్యలు వుంటే ఫోన్ చేసి నా దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులకు సూచించారు. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం అందించిన పలు సంక్షేమ పధకాలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని ప్రజలు స్వయంగా తెల్పడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్ రెడ్డి తెలిపారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ భరోసా, వైయస్సార్ చేయూత, వైఎస్ఆర్ చేదోడు, సున్న వడ్డీ రుణాలు, రైతు భరోసా పథకాలు, ఆరోగ్య శ్రీ సేవలు, పేదలందరికీ ఇల్లు, లాంటి ఎన్నోపథకాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తోందని అవి మీకు సకాలంలో అందుతున్నాయా లేదా తెలుసుకోవడం జరుగు చున్నదని, సంక్షేమ పధకాల అమలులో ఏమైనా సమస్యలు ఉంటే త్వరితగతిన పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటానని, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు.
