Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జడ్పీ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ, వైసీపి రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి కుమారుడు ఆనం కార్తికేయరెడ్డి… కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం బెంగుళూరులోని సిఎం క్యాంపు కార్యాలయానికిి వెళ్లిన ఆనం కార్తికేయ రెడ్డి, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో కాసేపు ముచ్చటించారు. ఏపిలో సంక్షేమ కార్యక్రమాలకు సిఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని వివరించారు. ఈ సందర్బంగా ఏపిలో ప్రవేశపెట్టిన సచివాల వ్యవస్థ చాలా బాగుందని బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించినట్లు కార్తీకేయ రెడ్డి తెలిపారు.