Clock Of Nellore ( Nellore ) – ఈ ఆర్ధిక సంవత్సరం 2022 – 23 కు చెల్లించవలసిన ఆస్థి పన్ను బకాయిలపై జూన్ నెల 30 వ తేదీ లోపు ఏలాంటి అపరాధ రుసుములు విధించకుండా సాధారణ పన్ను మొత్తాలనే చెల్లించేందుకు అనుమతిస్తున్నామని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆస్థి పన్ను బకాయిలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సూచించిన గడువులోపు పన్నులు చెల్లించి నగర అభివృద్ధి కి సహకరించాలని సూచించారు. మొబైల్ ఫోన్ నుంచి ఆన్లైన్ విధానంలో “ఎన్.ఎమ్.సి ఫర్ యు” యాప్ ద్వారా పన్ను బకాయిల వివరాలను తెలుసుకుని, కార్పొరేషన్ కు చెల్లింపులు చేయవచ్చని కమిషనర్ తెలిపారు.