Clock Of Nellore ( Anantha Sagaram ) – నెల్లూరుజిల్లాలో సోమశిల జలాశయంలో ( Somasila Project ) నీళ్లు తాగేందుకు వచ్చి ప్రమాదవ శాత్తూ అందులో పడి దుప్పి మృత్యువాత పడింది. జలాశయానికి అటవీ ప్రాంతం దగ్గరగా ఉండటంలో దుప్పి ఆ ప్రాంతానికి వచ్చింది. జలాశయం దిగువ ప్రాంతంలోని ఆప్రాన్ వద్ద నీళ్లు తాగే క్రమంలో జారీ సీలింగ్ బేసిన్ లో పడిపోయింది. ఊపిరి ఆడక బేసిన్ లోనే చనిపోయింది. విషయం తెలుసుకున్న జలాశయం సిబ్బంది అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా అధికారులు అక్కడకు చేరుకుని బేసిన్ లో పడిపోయి ఉన్న దుప్పి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు ఆత్మకూరుకు తరలించారు.
Tags: Deer Die somasila project