బడుగులపై పిడుగు… దొరవారి సత్రంలో బాలుడు మృత్యువాత

Clock Of Nellore ( DV Satram ) – తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం, పాలెంపాడు గ్రామంలో పిడుగుపాటుకు 15 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఉరుములతో కూడిన భారీ ఈదురు గాలులు వీచాయి. అదే సమయంలో 15 ఏళ్ల గంధం శంకరయ్య అనే బాలుడు గ్రామానికి సమీపంలో గేదెలు మేపుతుండగా అతనిపై పిడుగు పడింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలోనే తల్లిదండ్రులు ఉండగా గమనించి అక్కడకు వెళ్లేలోగా చనిపోయి ఉండటాన్ని చూసి తల్లడిల్లి పోయారు.

Read Previous

మొగళ్లపాళెం గిరిజన కాలనీలో “జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి బాట”

Read Next

15 ఏళ్ల బాలుడికి మెడికవర్ లో విజయవంతంగా క్లిష్టమైన గుండె ఆపరేషన్

Leave a Reply

Your email address will not be published.